విద్య అనేది డిగ్రీలు, మార్కులే కాదు
ముకరంపుర,(విజయ క్రాంతి): ప్రజాపిత బ్రహ్మా కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం(Easwariya University) స్థానిక సేవా కేంద్రం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో డిగ్రీలకు మించిన విద్య - విద్య విధానంలో మార్పు ఒక సంకల్పంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ వర్గం ద్వారా అంతర్జాతీయ ముఖ్య సేవా కేంద్రం రాజస్థాన్, మౌంట్ అబూ లో ఈ ప్రొఫెషన్ వారికి గత కొన్ని సంవత్సరాలుగా సేవలు జరుగుతున్నాయి. ఈ సం|| మన కరీంనగర్ లో నిర్వహిస్తున్నాం. విద్య అనేది కేవలం డిగ్రీలు, మార్కులు, అకాడమిక్ విజయాల కే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్ర వికాసం, మానవీయ విలువలు మరియు ఆరోగ్యకరమైన విద్యా వాతావరణ నిర్మాణానికి దోహద పడాలనే ఉద్దేశంతో ఈ ఒకరోజు విద్యా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం ఈనెల 2వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు కరీంనగర్ డీ-మార్ట్ సమీపంలోని EN గార్డెన్స్, సీతారాంపూర్ లో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాకుమారీస్ కరీంనగర్ మరియు TRSMA సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.






