10-02-2026 12:36:03 AM
తాడ్వాయి,ఫిబ్రవరి, 9( విజయ క్రాంతి): ఉపాధి హామీ పనులు నాణ్యతగా చేయాలని ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఆమె సోమవారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులను నాణ్యతగా చేయాలన్నారు. కూలీలకు కొలతల ప్రకారమే డబ్బులు వస్తాయని తెలిపారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి, క్షేత్ర సహాయకుడు తదితరులు పాల్గొన్నారు.