calender_icon.png 10 February, 2026 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనరేట్ పరిధిలో బీఎన్‌ఎస్ 163 అమలు

10-02-2026 12:35:39 AM

కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో ఈ నెల 11న జరగనున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ పోలీస్ కమి షనరేట్ పరిధిలో 163 బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ (గతంలో 144 సెక్షన్) విధిస్తూ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎ క్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈ నెల 10న ఉదయం 06 గంటల నుండి 12న ఉదయం 06 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఏదైనా చట్టబద్ధమైన సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే, సంబంధిత అధికారుల నుండి ముం దస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు.