10-02-2026 01:28:10 AM
11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భవాని
గజ్వేల్, ఫిబ్రవరి 9: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చివరి రోజు కావడంతో బిఆర్‌ఎస్ 11 వార్డు అ భ్యర్థి కొలిచెల్మ భవాని కరుణాకర్ ప్రచారంలో జోరు పెంచారు. సోమవారం వార్డు పరిధిలోని లక్ష్మాపూర్, సంగాపూర్, బంజరుపల్లి, లో ఇంటింటి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తు పై ఓటు వేసి తమను గెలిపించాలన్నారు. కౌన్సిలర్ అయిన వెంటనే అభివృద్ధిపై దృష్టి పెట్టి వార్డు సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
అవకాశం ఇచ్చి ఆదరిస్తే సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. వార్డు ప్రజలందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. భారీ మెజారిటీతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని వేడుకున్నారు. వారి వెంట లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచేల్మా స్వామి,పుంటి కూర రమేష్,మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.