23 July, 2026 | 2:51 AM

నిర్మల్ కొయ్య బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

23-07-2026 01:53 AM

నిర్మల్, జులై 22 ( విజయక్రాంతి): ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం అందిస్తామని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రాన్ని సందర్శించారు. దేశంలో సంస్కృతి సంప్రదాయ కళ సంపత్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అన్నారు.

నిర్మల్ కొయ్య బొమ్మలకు కావలసిన పో వనం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్మల్ బొమ్మలకు జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) కల్పించి, మార్కెటింగ్ కు సరైన అవకాశాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వారికి ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గౌతమ్ రావు గారు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారు నాయకులు రావుల రాంనాథ్ గారు, పట్టణ కౌన్సిలర్ లు నాయకులు పాల్గొన్నారు.