23 July, 2026 | 2:44 AM

గురుపౌర్ణమి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ బోధన్ డిపో ప్రత్యేక షిరిడీ యాత్ర

23-07-2026 01:43 AM

బోధన్, జూలై 22 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బోధన్ డిపో ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా బోధన్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల భక్తుల కోసం ప్రత్యేక షిరిడి యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో అధికారులు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు జూలై 27, 2026న మధ్యాహ్నం 1:00 గంటలకు బోధన్ నుంచి బయలుదేరుతుంది. యాత్రలో పర్లి, ఔరంగాబాద్, శని శింగణాపూర్, షిరిడి, నాసిక్, త్య్రంబకేశ్వర్, సప్తశృంగి, ఎల్లోరా, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.

యాత్ర వివరాలు:

జూలై 27: బోధన్ నుంచి బయలుదేరు.

జూలై 28: షిరిడిలో బస.

జూలై 29: షిరిడి సాయిబాబా దర్శనం అనంతరం సాయంత్రం 7:00 గంటలకు త్య్రంబకేశ్వర్కు బయలుదేరు.

జూలై 30: నాసిక్, సప్తశృంగి దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణంలో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం.

జూలై 31: ఉదయం 8:00 గంటలకు బోధన్ చేరుకోనుంది.

టికెట్ ధర: ఒక్కొక్కరికి రూ. 3,500.యాత్రకు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆసక్తి గల భక్తులు www.tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే మరిన్ని వివరాల కోసం బోధన్ డిపో అధికారులు అందించిన సంప్రదింపు నంబర్లను సంప్రదించాలని సూచించారు.