calender_icon.png 10 February, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా యాప్‌తో రైతులకు కష్టాలు

10-02-2026 01:26:45 AM

బెజ్జంకి,ఫిబ్రవరి9:యూరియా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ రైతులకు తలనొప్పిగా మారిందాని ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దీటి బాల నర్సు అన్నారు.సోమవారంసిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షడు దీటి బాల నర్సువిజయక్రాంతి తో మాట్లాడుతూ యూరియా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ రైతులకు ప్రయోజనకరంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు యాప్ అవగాహన లేమితో తలనొప్పిగా మారింది. యాప్ వినియోగంపై సరైన శిక్షణ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ తప్పనిసరి కావడం, ఓటిపి సమస్యలు, పంట విస్తీర్ణం ప్రకారం పరిమిత ఎరువులు పంటను బట్టి ఎకరాకు 2-3 బస్తాలు వంటి నిబంధనలతో డిజిటల్ ప్రక్రియ రైతులను కష్టాల్లోకి నెట్టిందని, యూరియా పంపిణీ యాప్ తొలగిం చి, ప్రభుత్వం నేరుగా యూరియా బస్తాలు రైతులకు అందేవిధంగా చూడాలని కోరారు