23 July, 2026 | 2:41 AM

వనమహోత్సవానికి వేళాయే..

23-07-2026 01:46 AM
  1. మున్సిపాలిటీలో 80 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా 
  2. అధికారుల సన్నాహాలు 
  3. ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం - చైర్ పర్సన్ అంజలి

లక్షేట్టిపేట, జూలై 22 : నిన్న, మొన్నటి వరకు వర్షాలు లేక మొక్కలు నాటేందుకు వన మహోత్సవాన్ని చేపట్టలేదు. ప్రస్తుతం అధికారులు మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పురపాలికతో పాటు మండలంలోని పలు పంచాయతీల్లో ప్రజలకు మొక్కలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వాటిని లెక్క ప్రకారం నాటి, పక్కగా సంరక్షితేనే ఫలితం ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు.

మున్సిపాలిటీలో 80 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా...

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 80 వేల మొక్కలను నాటాలని అధికారులు ల క్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 50 వేల మొ క్కలను ఇంటింటికి అందించాలని నిర్ణయించగా, 10 వేల మొక్కలను ఇప్పటికే గుర్తిం చిన పలు ప్రాంతాల్లో నాటాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతానికి సుమారు 20 వేల వరకు మొక్కలు మున్సిపాలిటీ ఆ ధ్వర్యంలోని నర్సరీలో నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు మున్సిపల్ పర్యావరణ ఇంజనీర్ కట్ల రాకేష్ తెలిపారు. కాగా, సుమారు 60 వేల మొక్కలు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కోసం అందుబా టులోకి వస్తాయని వివరించారు.

మొక్కలు నాటే ప్రాంతాలు ఇవే....

పట్టణంలోని మహాత్మ జ్యోతి బాఫూలే గురుకుల పాఠశాల /కళాశాల, ప్రభుత్వ మో డల్ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూరి భా గాంధీ, శిశు మం దిర్ పాఠశాలలు, బృహత్ పట్టణ ప్రకృ తి వనం, ఏంపీడీఓ, ఐబీ ప్రకృతి వనాలతో పా టు మరికొన్ని ప్రాంతాలుంటాయని అధికారులు వెల్లడించారు. 

అందుబాటులో ఉన్న మొక్కలివే

మున్సిపాలిటీ నర్సరీలో జామ, నిమ్మ, టెకోమా, గుల్మోర్, కానుగ, గన్నేరు, వేప, దానిమ్మ, చక్రం, మల్లెలు వన మహోత్సవానికి అందుబాటులో ఉన్నాయి. సంచి పరి మాణాన్ని దృష్టిలో ఉంచుకొని గుంత తవ్వా లి. సారవంతమైన మట్టి, పశువుల ఎరువు, డీఏపీ 2:1 నిష్పత్తిలో కలిపి సగం గుంత నిం పి నీళ్లు పోయాలి. మరుసటి రోజు వేపపిండితో గుంతను శుద్ధి చేస్తే మొక్కకు పురుగు పట్టకుండా ఉంటుంది.

మొక్క వేళ్ల కు బయ ట గాలి తగలకుండా గుంత చుట్టూ గట్టిగా తొక్కాలి. రోడ్లకు ఇరువైపులా నాటే క్రమం లో నిబంధనల మేరకు చివరలో నాటాలి. నాటిన మొక్కలను రక్షించేందుకు మూగజీవాల తినకుండా రక్షణ కంచె (ట్రీ గార్డ్) ఏర్పాటు చేయాలి. చెట్ల కింద, విద్యుత్తు తీగల కింద మొక్కలు నాటొద్దు. చౌడు భూమిలో టేకు, వెదురు నాటితే చనిపోయే ప్రమాదం ఉంది.

లక్ష్యానికనుగుణంగా మొక్కలు నాటుతాం

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికనుగుణంగా ఇప్పటికే గుర్తించినటువంటి పలు ప్రదేశాల్లో మొక్కలు నాటుతాం. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతాం.

విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్, లక్షెట్టిపేట

ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మ హోత్సవం విజయవంతం కావా లంటే ప్రజల భా గస్వామ్యం ఎం తో అవసరం. ప్రతి ఇంటిలో మొక్కలు నాటే విధంగా ప్రణాళిక రూపొందిం చాం. ఈ ఏడాది వేసవితాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది కాబట్టి యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. జీవుల మనుగడలో చెట్ల ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి.

 దొంత అంజలి, మున్సిపల్ చైర్ పర్సన్, లక్షెట్టిపేట