23 July, 2026 | 2:43 AM

పట్టణంలో దూకుడు దొంగల బీభత్సం

23-07-2026 01:50 AM

ఒకే రాత్రి.. మూడు ఇళ్లకు కన్నం 

నిర్మల్, జులై 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో ఒకే రాత్రి వరుస చోరీలు చోటుచేసు కోవడంతో స్థానికులు భయాందోళనకు గు రయ్యారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. కాలనీలో నివసించే లింగన్న, సునీత, లక్ష్మి ఇళ్లలోకి చాక చక్యంగా ప్రవేశించిన దొంగలు అల్మారాలు, బీరువాలు గాలించి చేతికందిన విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

ఉదయం ఇంటి యజమానులు వచ్చి చూడగా తాళాలు పగులగొట్టడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో భయాందోళన నెలకొంది. సమా చారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య, పోలీసులు చోరి జరిగిన ఇ ళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.