23 July, 2026 | 2:51 AM

కాంగ్రెస్ నేతల అరెస్టు నిరసిస్తూ నిరసన

23-07-2026 01:54 AM

నిర్మల్, జులై 22 ( విజయక్రాంతి): దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నీట్ పరీక్షకు లీకేజీ ఈ బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లను విడుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిరసన తెలిపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ నాయకులను అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహిం చి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.