ఢిల్లీలో మళ్లీ హింస
- పోలీసులపై అల్లరిమూకల రాళ్లదాడి
- ఇద్దరు ఏసీపీలతో సహా ఆరుగురికి గాయాలు
- జంతర్‌మంతర్‌కు పెద్ద సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు
న్యూఢిల్లీ, జూలై 22: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం సాయంత్రం మళ్లీ హింసకు దారితీసింది. పోలీసులపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు (ఏసీపీలు), నలుగురు సిబ్బంది గాయపడ్డారని పోలీసువర్గాలు తెలిపాయి. నిరసన ప్రదేశంలోకి అనేక ‘సామాజిక వ్యతిరేక’ శక్తులు ప్రవేశించాయన్నారు. వారు నిర్వాహకుల (సీజేపీ) మాట కూడా వినకుండా పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వుతున్నారని తెలిపారు.
మరోవైపు జంతర్‌మంతర్‌కు పెద్ద సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు తరలొచ్చారు. మళ్లీ ఏ క్షణమైనా ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండడం తో పోలీసులు మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్ వద్ద బుధవా రం సాయం త్రం పోలీసులపై అల్లరిమూకలు రెండు సార్లు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో గా యాలైన ఇద్దరు ఏసీపీలు, మరో నలుగురు సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
- అపరిచితుల నుంచి భోజనాలు
జూలై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన కా క్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనకు ఆర్థిక సాయం ఎక్కడి నుంచి వస్తోందనే ప్రశ్నలు మొదలైంది. ఈ సమయంలో, అపరిచితులైన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆహారాన్ని పంప డం ప్రారంభించారు. జంతర్‌మంతర్ నిరసన ప్రాంతంలో ప్రవేశించగానే వరుసగా ఫుడ్ డెలివరీ బైక్లు దర్శనమిస్తున్నాయి.
కార్యకర్తలు ఆహార పెట్టెలను దించుతుండగానే మరో డెలివరీ బాయ్ అక్కడకు చేరుకుంటున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఇదే దృశ్యం కనిపించింది. ఆందోళన జరుగుతున్న ప్రదేశంలో ఒకవైపు పప్పు అన్నం, మరోవైపు రాజ్మా అన్నం పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే టీ, శాండ్విచ్‌లు రాగా, సాయంత్రానికి బర్గర్లు కూడా అందుతున్నాయి. మంచినీళ్ల సీసాల పెట్టెలు దారుల వెంట పేర్చి ఉన్నాయి.






