calender_icon.png 5 February, 2026 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా ‘ధనిక్ భారత్’ విద్య ఉద్యమం

05-02-2026 12:00:00 AM

  1. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య ప్రారంభం

బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం

‘ధనిక్ భారత్’ డైరెక్టర్ మల్లవరపు బాలలత

నల్గొండ టౌన్, ఫిబ్రవరి 4: విద్య దేశ అభివృద్ధికి ప్రధాన శక్తి అన్న దృఢ విశ్వాసంతో ‘ధనిక్ భారత్’ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయని ధనిక్ భారత్ సంస్థ డైరెక్టర్ మల్లవరపు బాలలత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో 9, 10వ తరగతి చదువుతున్న వివిధ పాఠశాలల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను అవగాహన కార్యక్రమాన్ని ‘ధనిక్ భారత్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలలత మాట్లాడుతూ.. సమతుల్య వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా లాయిడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ప్రముఖ పరిశ్రమకవేత్త విక్రం నారాయణరావు ఆధ్వర్యంలో ధనిక్ భారత్ విద్యా సంస్థలు రూపుదిద్దుకున్నాయని వివరించారు పరిశ్రమ అనుభవాన్ని విద్యతో అనుసంధానం చేస్తూ, ఇన్నోవేషన్ ఆధారిత బోధనా విధానాలు, క్రమశిక్షణ గల సంస్థాగత అభివృద్ధి సంస్థ తత్వమని తెలిపారు.

తరగతి గదులు విద్యార్థుల భవిష్యత్ నాయకులను తయారు చేసే ప్రయోగశాలలుగా మారాలనే దృక్పథంతో విద్యను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా నాయకత్వం, ఔత్సాహికత, దేశ నిర్మాణం వైపు దారి మళ్లించడమే తమ లక్ష్యమమన్నారు. ఇంటర్మీడియట్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఐఐటీలు, మెడికల్ కాలేజీలు, యూపీఎస్సీ వంటి ఉన్నత విజయాలకు ఇంటర్మీడియట్ దశే పునాది అన్న స్పష్టమైన అవగాహనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

అనేక మంది విజయవంతమైన యూపీఎస్సీ అభ్యర్థులు, ఐఐటీఎన్‌ఐటీ, ప్రీమియర్ మెడికల్ విద్య నేపథ్యాల నుంచే వచ్చారని గుర్తుచేస్తూ.. ఐఐటీ, జేఈఈ, నీట్ కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. తక్కువ విద్యార్థిగురువు నిష్పత్తితో, ప్రత్యేకంగా సగటు విద్యార్థులపై గరిష్ట దృష్టి సారించి వారి ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, స్థైర్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు.

విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యా వాతావరణంతో పాటు కౌన్సిలింగ్ ద్వారా మానసిక ధైర్యం, జీవన లక్ష్యాలపై స్పష్టత కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు విక్రం అజయ్ బాబు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్య క్రమంలో ధనిక్ భారత్’ విద్యాసంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విక్రం సురేంద్ర బాబు, అళ్ల గిరిబాబు, డాక్టర్ సలీం, డీన్ రవికాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.