calender_icon.png 7 February, 2026 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన క్రిప్టో మార్కెట్

07-02-2026 12:00:00 AM

న్యూయార్క్, ఫిబ్రవరి ౬: బిట్‌కాయిన్ విలువ భారీగా పతనమైంది. దాని విలువ 12 శాతం పడిపోయింది. శుక్రవారం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది. గతేడాది అక్టోబర్ తర్వాత ఇదే అత్యంత బలహీనమైన స్థాయి. ఒక దశలో 60,000 డాలర్ల కనిష్ఠానికీ చేరుకుంది. ఐటీ షేర్ల అమ్మకాలు, విలువైన బంగారం, వెండి ధరల అస్థిరతే పతనానికి ప్రధాన కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఏఎఫ్‌ఆర్) తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్న్‌ను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఎంపిక చేయడం కూడా క్రిప్టో మార్కెట్ ప్రభావితమైంది. కెవిన్ వార్న్‌ను గతంలో కఠినమైన ద్రవ్య విధానాలను సమర్థించిన వ్యక్తి కావడంతో లిక్విడిటీ తగ్గుతుందనే అంచనాలున్నాయి.

దీంతో ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి సంస్థాగత మదుపర్లు భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మార్కెట్ ఇప్పుడు ‘బేర్’ పరిధిలో చిక్కుకున్నది. అమెరికా లేబర్ డేటా, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెరిగిన వ్యయాలు మదుపర్ల మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. దీంతో ఒక్క రోజులోనే ఒక బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీర్ఘకాలిక మదుపర్లకు ఈ దశ ఒక మంచి కొనుగోలు అవకాశంగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 55,500 డాలర్ల వద్ద కీలక మద్దతు కనిపిస్తోంది. ఒక్క జనవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డాలర్ల పెట్టబడులు వెనక్కి వెళ్లడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం సాధారణ మదుపర్లు క్రిప్టోపై ఆసక్తి కోల్పోతున్నారు.