07-02-2026 12:33:05 AM
డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికం
చెన్నై, ఫిబ్రవరి 5: రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురువారం జరిగిన సమావేశంలో డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆమోదించారు. అలాగే రుణాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం రుణాలు: డిసెంబర్ 31, 2025 నాటికి మొత్తం రుణాల విలువ రూ.15,394 కోట్లు. గత ఏడాది ఇదే సమయంతో (రూ.14,155 కోట్లు) పోలిస్తే ఇది 8.8% వృద్ధిని నమోదు చేసింది.
రుణాల వర్గీకరణ పరంగా.. నాన్-శాలరీడ్ (ఉద్యోగం లేని వారు/వ్యాపారస్తులు): 52.9%, శాలరీడ్ (ఉద్యోగులు): 47.1%, ఉత్పత్తుల వారీగా.. గృహ రుణాలు: 71.0%, హోమ్ ఈక్విటీ ప్రొడక్ట్స్ 29.0%, కంపెనీ ఇచ్చిన రుణాలన్నీ (100%) రిటైల్ రుణాలే. కాగా స్థూల నిరర్ధక ఆస్తుల విలువ డిసెంబర్ 31, 2025 నాటికి రూ.450 కోట్లు (గత ఏడాది రూ.546 కోట్లు). జీఎన్‌పీఏ నిష్పత్తి 2.92% గా ఉంది. నికర నిరర్ధక ఆస్తుల విలువ రూ.213 కోట్లు. ఎన్‌ఎన్‌పీఏ నిష్పత్తి 1.38% గా ఉంది.
కంపెనీ రూ.359 కోట్ల (మొత్తం రుణాలలో 2.3%) కేటాయింపులను కలిగి ఉంది. స్టేజ్-3 ఆస్తుల కవరేజ్ నిష్పత్తి 53% గా ఉంది. డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 205 బ్రాంచీలు, 31 శాటిలైట్ సెంటర్లు ఉన్నాయి.