6 May, 2026 | 4:27 AM

జూన్‌లో సీఎం ఇల్లు ముట్టడిస్తాం

06-05-2026 03:02 AM

ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కుట్రను మానుకోవాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఫీజుల స్కీమును యధాతథంగా అమలు చేయాలనీ లేనిపక్షంలో జూన్ చివరి వారంలో 5 లక్షల మందితో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఎత్తి వేయాలని కుట్రలు చేస్తుందని, అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలో బడ్జెట్ విడుదల చేయకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ మేర కు మంగళవారం  మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య  మాట్లాడుతూ బడ్జెట్ కొరత అనడం బుకాయింపు పచ్చి మోసమన్నారు. ఎందుకంటే ఈ 30 నెలల కాలంలో ప్రభుత్వానికి పన్నులు ఇతర వర్గాల నుంచి 6 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని, అలాగే 3 లక్షల 60 కోట్లు అప్పులు తెచ్చారన్నారు.

కొందరు కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లిందారు. కానీ 14 లక్షల మంది విద్యార్థుల స్కాల ర్ షిప్ ఫీజులు 8వేల కోట్లు చెల్లించడానికి మనసు ఒప్పుకోలేదని, ఈ కులాలు చదువు కుంటే ఓర్వలేక పోతున్నారన్నడానికి ఇంకే ఉదాహరణ అవసరం లేదన్నారు. జీవో నెంబ ర్ 7 ద్వారా ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకిక్కిందాలని చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షే మ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లగొర్ల మోడీ రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.