5 July, 2026 | 4:49 PM

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య

05-07-2026 04:03 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్ రోడ్డు, చుక్కాలబోడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాలోత్ లిఖిత–నరేందర్, మాలోత్ శ్రీను–జ్యోతి కుటుంబాలు నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం లబ్ధిదారులను, వారి కుటుంబ సభ్యులను అభినందించి, నూతన గృహంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలు సొంత ఇంటి కలను నెరవేర్చు కుంటున్నాయని తెలిపారు. ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.