బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి
బిసి చలో భువనగిరి-రాజ్యాధికార సమరభేరి
సభకు కామారెడ్డి జిల్లా నుండి భారీ తరలింపు
కామారెడ్డి జిల్లా రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్
కామారెడ్డి,(విజయక్రాంతి): భువనగిరిలో జరిగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరి సభకు కామారెడ్డి జిల్లా నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుండి వందలాది మంది కార్యకర్తలు భారీ వాహనాలతో బయలుదేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తాహెర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, ఉపాధ్యక్షులు రాజు, ఓబీసీ సెల్ అధ్యక్షులు సంగమేశ్వర్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ హన్మాండ్లు, తుకారం, భాగయ్య, జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జీ ఈశ్వర్, ఇతర మండల అధ్యక్షులు, నాయకులు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు తాహెర్ మాట్లాడుతూ... బిసిలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నా మన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మూడూ పార్టీలు బిసిలను మోసం చేశాయి. ఇక బిసి ముఖ్యమంత్రిని తెలంగాణలో చూడాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీనే ప్రత్యామ్నాయం అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారని, భువనగిరి సభ చరిత్రాత్మక సభగా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.






