సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట (విజయక్రాంతి): సీసీ కెమెరాల ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందని, సిద్దిపేట అంటే పచ్చదనం.. పరిశుభ్రత.. ప్రజా రక్షణ గా చేసుకున్నమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం 3 వార్డులోని బృందంవన్ కాలనిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు ప్రారంభించి మాట్లాడారు. బృంద వన్ కాలనీ నందన వనంగా మార్చుకున్నామని, సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెట్లు ఇలా అన్ని చేసుకుమన్నామని చెప్పారు.
హనుమాన్ దేవాలయం నిర్మాణానికి నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఈ కాలనీకి మీరు అడిగిన వెంటనే అన్ని చేసుకున్నామని చెప్పారు. పదేళ్ల లో సిద్దిపేట ను క్లిన్.. గ్రీన్.. సేఫ్ సిద్దిపేట గా మార్చుకున్నమని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమవుతుంది అనడానికి బృంద వన్ కాలనీ ప్రజలు ఆదర్శమని చెప్పారు. కాలనీ ఏ అవసరం ఉన్న నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.






