5 July, 2026 | 5:56 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

పరిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

05-07-2026 05:04 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలో ఆదివారం మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాస్ గౌడ్ పరిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఏడవ,ఎనిమిదవ వార్డులలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఏడవ వార్డులో నాలను ఆక్రమించుకొని మురికి నీరు వెళ్లటానికి ఇబ్బందికరంగా ఉన్న దృశ్య పారిశుద్ధ్య  సిబ్బంది మురికి కాలువ తీయటానికి స్లాబ్ క్రింది భాగానికి వెళ్లి మురికి నీరు తీయాల్సి వస్తున్నదన్నారు.

ఎవరైనా మురికి కాలువలను మరియు నాలాను ఆక్రమించుకొని స్లాబ్ వేస్తె అది పగలగొట్టడం జరుగుతుందని వారి పైన మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. అలాగే మూడవ వార్డులో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిన దానిని పరిశీలించి నీరు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎనిమిదో వార్డులో జెసిబి ద్వారా మురికి కాలువ తీయించడం జరుగుతుందని పేర్కొన్నారు.