5 July, 2026 | 6:24 PM

జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

05-07-2026 05:35 PM

- వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

- స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ డివిజన్ కేంద్రంలోని పీఆర్టీయు భవనంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగాఎఐఎస్ ఎప్  జిల్లా కార్యదర్శి బోడ. అనిల్, పిడిఎఫ్ యు జిల్లా అధ్యక్షులు ఆర్. గౌతమ్ కుమార్ లు మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.