రెండో డివిజన్లో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన
05-07-2026 05:01 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రెండో డివిజన్ తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్ రోడ్ నెంబర్ 5లో రూ. 10 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
అలాగే సి ఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నగర మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రహదారులు డ్రైనేజీ సౌకర్యాలు అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్ మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.






