5 July, 2026 | 5:52 PM

దూకుడు పెంచిన తెలంగాణ రక్షణ సేన

05-07-2026 04:58 PM

బోథ్,(విజయక్రాంతి): దిలాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సమితి కార్యకలాపాలు చాప కింద నీరుల విస్తరిస్తున్నాయి. బోత్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు తెలంగాణ రక్షణ సమితి పార్టీలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నెలరోజుల క్రితం చేరడం జరిగింది. అయితే అప్పటినుండి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

మొదట అన్ని గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మండల కేంద్రాలలో మండల కన్వీనర్లను ఎంపిక చేసి ఆ తర్వాత పార్టీ జెండాలను ఎగురవేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే గత పది రోజులుగా పలు మండలాలలో పార్టీ గద్దెల నిర్మాణం చేపట్టి జెండాను ఎగరవేయడం జరుగుతుంది.

భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు

ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఈయనకు మొదట మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు బిఆర్ఎస్ టికెట్టును కేటాయించడం జరిగింది. అయితే అప్పటినుండి తనకున్న రాజకీయ అనుభవంతో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ని బలోపేతం చేసి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గతంలో ఉన్న తన అనుచరులను తెలంగాణ రక్షణ సమితి పార్టీలో కి ఆహ్వానిస్తూ పార్టీ పరంగా పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు దీంతో పార్టీ తన బలాన్ని పెంచుకుంటున్నది.

అవసరమైతే స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం

రానున్న సమీప భవిష్యత్తులో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు కనుక ప్రభుత్వం జరిపితే స్థానిక ఎన్నికల బరిలోకి దిగేందుకు తెలంగాణ రక్షణ సమితి సిద్ధమవుతున్నది గ్రామస్థాయిలో పార్టీకి పట్టు సాధించినట్లయితే అసెంబ్లీ ఎన్నికల వరకు తిరుగులేని రాజకీయ శక్తిగా పెరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఏది ఏమైనా తెలంగాణ రక్షణ సమితి పోరుకు సిద్ధమవుతుండడంతో భవిష్యత్తులో రాజకీయ పార్టీల బలబలాలు మారే ఆస్కారం ఉంది