నాలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మే 5(విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలో నాలాల సంబంధిత సమ స్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్‌లను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రహ్మత్ నగర్, శ్రీకృష్ణానగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో నెలకొన్న నాలాల దుస్థితిని వారికి వివరించి శాశ్వత పరిష్కారం చూపాలని వినతి పత్రాలను అందజేశారు.
ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో నాలాల పరిస్థితిపై పూర్తిస్థాయి సాంకేతిక సర్వే నిర్వహిం చాలని అధికారులను కోరినట్లు తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన చేపట్టాలని విన్న వించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






