5 July, 2026 | 6:24 PM

రామేశ్వరం ఆర్టీసీ బస్సు

05-07-2026 05:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో రామేశ్వరం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్టు డిపోమేనేజర్ కే.పండరి తెలిపారు.ఈ బస్సు నిర్మల్ నుండి బయలుదేరి కానిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాళషెంబు, మదురై గుండా రామేశ్వరం వెళ్లి తిరిగి కంచిపురం, శ్రీ కాళహస్తి గుండా నిర్మల్ చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించినందున ఎన్నో యాత్ర సర్వీసులు పెట్టడం జరిగిందని ఇక ముందు ప్రయాణికుల కోరిక మేరకు సోమనాథ్, ద్వారక  లాంటి పుణ్యక్షేత్రలకు బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు. ఇంతకు ముందు కాశీ, అయోధ్య, నైమి శరణ్య,ఉజ్జాయిని, ఓంకారేశ్వర్, పూరి జగన్నాథ్, కోణార్క్, అన్నవరం, అర్సవెల్లి, సింహచలం, విశాఖపట్నం, ద్వారక తిరుమల, భద్రాచలం పండరిపూర్, తుల్జాపూర్, కొలహాపూర్, గోవా వెళ్లివచ్చినట్లు గుర్తుచేసారు. ప్రయాణికులు అడిగిన చోటికి యాత్రా బస్సులు పెడుతున్నామని ఆయన తెలిపారు.