కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వివరాలపై కలెక్టర్ శ్వేతపత్రం విడుదల చేయాలి
- భూ కబ్జా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు చరణ్
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వివరాలపై కలెక్టర్ శ్వేతా పత్రం విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు చరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాదారు కూరల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను రక్షించాలన్నారు.
భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1964 లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీల శాఖ అందించిన 264 ఎకరాల నాలుగు గంటల భూమిని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు ఎన్ని ఎకరాలు కేటాయించారు సర్వే నెంబర్లతో సహా వాటివి భూముల వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయాలన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విన్నవిస్తుందన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరు పైన రిజిస్ట్రేషన్ అయిన భూమి వివరాలు మ్యాప్ తో సహా మీరు తెలియజేస్తూ 254 ఎకరాలు నాలుగు గంటల భూమి పూర్తి వివరాలు మీడియా సాక్షిగా ప్రకటించాలన్నారు. 2021లో చేపట్టిన కళాశాల భూముల సర్వే వివరాల ను ప్రజాక్షేత్రంలో ఉంచాలని అలాగే అక్రమంగా కళాశాల భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు కబ్జా దారుల కోరల నుండి కాపాడాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ పట్టణ కార్యదర్శి సంజయ్, ఏబీవీపీ కార్యకర్తలు పవన్, విష్ణు, చరణ్, రాకేష్, భరత్, సిద్దు విద్యార్థులు పాల్గొన్నారు.




