కొత్త చిత్రానికి క్లాప్ కొట్టేశారు!
నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీతో కలిసి ఆయన చేస్తున్న ఈ సినిమా ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, కుటుంబ భావోద్వేగాలతో రూపుదిద్దుకోనుంది. భరత్ చౌదరి నిర్మాత. కథ, స్క్రీన్‌ప్లే అం దిస్తూ చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలు చదలవాడ శ్రీనివసరావు దిల్ రాజు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.
క్రేజీ హీరోయిన్ నయన్ సారిక ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నటిస్తుండగా.. నరేశ్ వీకే, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ సీ దిలీప్, ప్రొడక్షన్ డిజైనర్‌గా సుప్రియా బట్టెపాటి పనిచేస్తున్నారు. జూన్ 10 నుంచి షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మేకర్స్ ఈ ఏడాదే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






