28 June, 2026 | 11:12 AM

విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి

28-06-2026 10:29 AM

పాలకవీడు,(విజయక్రాంతి): మండలంలోని దేవ తండాలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై టెక్నీషియన్ మృతి చెందినట్లు పాలకవీడు ఎస్సై ఆర్. కోటేష్ తెలిపా రు.మిర్యాలగూడ సీతా రాంపురానికి చెందిన కోడి శ్రీకాంత్ (40) సాగర్ రోడ్డులో ఉన్న వాటర్ ఫిల్టర్ దుకాణంలో పనిచేస్తూ ఆక్వాగార్డ్ వినోవిక్ కంపెనీకి చెందిన వాటర్ ఫిల్టర్ లను అమర్చే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దేవ తండాకు చెందిన బానోత్ సలుకు ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఫిట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్క డికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కోటేష్ తెలిపారు.