12 May, 2026 | 2:58 AM

పూర్తిస్థాయి వినోదభరితంగా..

12-05-2026 12:41 AM

సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా వస్తోంది. ‘రంగబలి’తో పేరుపొందిన పవన్ బసంశెట్టి దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. ఈ ప్రాజెక్టును నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై నాగార్జునరెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లాప్ కొట్టారు.

దర్శకుడు మహేశ్‌బాబు పీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు యదువంశీ, సందీప్ రాజ్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందించారు. సత్య, యోగిబాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభ మైంది. సత్య, యోగిబాబుల కామెడీ టైమింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటూ సహజమైన హాస్యాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు డైరెక్టర్ పవన్ బసంశెట్టి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాబ్లు అజు; సంగీతం: పవన్ సీహెచ్; ఆర్ట్: కామేశ్.