12 May, 2026 | 1:46 AM

వరుణ్ సందేశ్ వైఫ్ మిస్సింగ్!

12-05-2026 12:38 AM

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఆహా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. ఈ సినిమాకు శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇటీవలే ‘నయనం’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకురాలు స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో చక్కటి ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు.

ఇందులో ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్యశ్రీ కీలకపాత్రలు పోషించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీశ్‌కుమార్ ఎన్‌ఎస్; సంగీతం: సాయి కార్తీక్ మాటలు: ఆదిత్య భార్గవ్; ఎడిటర్: సాయిబాబు తలారి; కథ: ఉమర్జీ అనురాధ; స్క్రీన్‌ప్లే: శ్రీనివాస్ మండల; నిర్మాత: శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు  దర్శకత్వం: స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ.