16 March, 2026 | 4:36 AM

ఆ ధనవంతుల కోసమే కేంద్రం పని చేస్తుంది

16-03-2026 12:09 AM
  1. లేబర్ కోడ్స్‌ను రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలి

సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు

మంచిర్యాల, మార్చి 15 (విజయక్రాంతి): ప్రపంచంలో 10 మంది  ధనవంతుల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని, వారి కంపెనీలకు లాభాలు చేకూర్చడానికి ప్రభుత్వ , అటవీ భూములను కారు చౌకగా కట్టబేడుతుందని  సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు లు బీవి రాఘవులు ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఇరు దేశాల యుద్ధంతో  సామాన్యులకు గ్యాస్ దొరకడం లేదని, ఓడరేవుల నుంచి కోడిగుడ్ల ఎగుమతి ఆగిపోయిందన్నా రు.

గ్రానైట్ ఎగుమతి తగ్గిపోయిందని, వంట నూనెలు ధరలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాబోయే రోజుల్లో చమురు పెట్రోల్, డిజిల్ కూడా సామాన్యులకు దొరకకుండా పోయే అవకాశం ఉందని హెచ్చరిం చారు. ఆదానీ, అంబానీల కోసమే బీజేపీ పని చేస్తుందని, అటవీ భూములను లాక్కోవడానికి  అటవీ హక్కు చట్టంలో మార్పు చేసింద న్నారు. రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ తెచ్చిన లేబర్ కోడ్స్ రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేశారు.

అటవీ హక్కుల చట్టాలను కాపాడాలి 

కేంద్ర బీజేపీ ప్రభుత్వం నేడు పేదలు జీవనోపాధి అయినా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తు చట్టంలో మార్పు తెచ్చి పేదలను ఇంకా పేదలుగా మార్చే కుట్ర కేంద్ర బీజేపీ చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవి కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య  ఎండి అబ్బాస్, రవీందర్,జిల్లా కార్యదర్శి సంకె రవి, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుకె అశోక్, ఏ. పున్నం,జి ప్రకాష్, బి చందు, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, కె. లింగన్న, డి. రాజారాం మల్లీశ్వరి, ఉమారాణి, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.