చట్టాలపై అవగాహనతోనే రక్షణ
జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి జబేజ్ శామ్యూల్
ఆదిలాబాద్, మార్చి 15, (విజయక్రాంతి): ప్రజలందరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే వ్యాపారులు చేసే మోసాల నుంచి రక్షించపొందవచ్చని జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి జబేజ్ శామ్యూల్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మండలంలోని చాం దా (టి) గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన వినియోగ దారుల అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో వినియోగదారులకు సంబంధించిన సుమారు 1,600 కేసులను పరిష్కరించినట్లు కమిషన్ జడ్జి జబేజ్ శామ్యూల్ తెలిపారు. ఈ కేసుల్లో వందలాది మంది వినియోగదారులకు కమిషన్ ద్వారా న్యాయం జరిగిందన్నారు.
ఎవరై నా అన్యాయం జరిగిందని భావిస్తే తప్పకుం డా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షుడు వి. మోహన్, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు డీవీఆర్ ఆంజనేయులు సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.




