5 March, 2026 | 7:28 PM

రాజ్యాధికారం లేని కులము కనుమరుగు

05-03-2026 05:54 PM

ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి అబ్రబోయిన స్వామి 

కామారెడ్డి అర్బన్,మార్చి 05 (విజయ క్రాంతి): రాజ్యాధికారం సాధించని సామాజిక వర్గం కనుమరుగవుతుందని  ముదిరాజ్ సంఘం కార్యదర్శి అబ్రబోయిన స్వామి అన్నారు. గురువారం దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజులు ఎన్నడూ లేని విధంగా మెరుగైన ఫలితాలు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారని తెలిపారు. ముదిరాజులు సమస్యలు పరిష్కరించుకుంటూ పోరాడితేనే ఆర్థిక సామాజిక రాజకీయ మనుగడ సాధ్యమని అన్నారు ఈ సమావేశంలో గ్రామ అధ్యక్షులు కృష్ణమూర్తి గ్రేట్ కుమార్ గరిగంటి భూపాల్ గరిగంటి స్వామి ఆకుల స్వామి నేల బాలయ్య గరిగంటి స్వామి గరిగంటి నర్సింలు పాండు అధ్యక్షులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు