కాన్సిరాం జయంతి పురస్కరించుకొని.. సిరిసిల్లలో భారీ బహిరంగ సభ
బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య కాన్సిరాం జయంతిని
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఈనెల 15న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు కోమ్మెట అశోక్ తెలిపారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొమ్మాట అశోక్ మాట్లాడుతూ, మార్చి 15 బీఎస్పీ వ్యవస్థాపకలు కాన్సిరాం జయంతి పురస్కరించుకొని సిరిసిల్లలో 5000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఈనెల ఆరు శుక్రవారం సిరిసిల్ల రెండో బైపాస్ లోని కామాక్షి బ్యాంకెట్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అని తెలిపారు.
ఈ సమావేశానికి జిల్లాలోని బీఎస్పీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రo శేఖర్, జోనల్ చీఫ్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం, నాలుగు పార్లమెంటుకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనగందుల వెంకన్న మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాన్షీరాం చూపిన బాటలో నడిచి బహుజన రాజ్యాన్ని సాధించుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభ సక్సెస్ చేయలేని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు లింగంపల్లి మహేష్ లో పాల్గొన్నారు.




