9 July, 2026 | 2:04 AM

బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టు కుంది

09-07-2026 12:10 AM
  1. అన్ని రంగాల అభివృద్ధికి కేంద్ర కృషి
  2. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ 

జడ్చర్ల/రాజాపూర్, జూలై 8: బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం బాలనగర్ మండలం మోతి ఘనపూర్, వీరన్నపల్లి రాజా పూర్ మండలం లాంభ్య తండాలో స్ట్రీట్ లైట్స్,సీసీ రోడ్లు, కల్లెపల్లి గ్రామంలో సీసీ రోడ్లు,రాయపల్లి గ్రామం లో హై మాస్ట్ లైట్స్, మహిళా సంఘం భవనం ప్రారంభించి, పాఠశాల కంపౌండ్ వాల్ కు ఎంపీ శంకుస్థాపన చేశారు.మినాంభరం శివాలయంలో ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీజేపీ నాయకులు ము చ్చర్లపల్లి జనార్ధన్ రెడ్డి సొంత నిధులు 7 లక్షలతో ఆల య అవరణలో వేసిన సీసీ రోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. గ్రామాలలో హై మాస్ట్ లైట్స్ లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం గ్రామం లో బీజేపీ జెండాను ఎంపీ ఆవిష్కరించి, బి ఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కోసం వీబీ  జీ రామ్ జీ పథకంలో అభివృద్ధి చేసుకుందామని, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనం నిర్మాణం ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

గ్రామ అభివృద్ధికి నా వం తు సహకారం అందిస్తానని, గ్రామంలో ఆర్వో ప్లాంట్  ఏర్పాటు చేసుకుందామన్నారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని, ప్రతి ఒక్కరు వికాసిత్ భారత్‌లో భాగస్వామ్యం కావాలన్నారు. వికాసిత్ భారత్ కోసం నరేంద్ర మోదీ పని చేస్తున్నారని, అందరి మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నా రు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చరా? ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వచ్చే నేతలను నమ్మకండని, ఇచ్చి న మాట బీజేపీ నిలబెట్టుకుందన్నారు. మిడ్జిల్ కేజీవీబీ బాలికల పాఠశాలలో ఉన్న మరిన్ని సమస్యల పరిష్కా రం కోరుతూ  ఉపాధ్యాయులు ఎంపీ డీకే అరుణ గారికి వినతి పత్రం అందజేయగా, సమస్యల పరిష్కారం కో సం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్ధన్ రెడ్డి,బాల త్రిపుర సుందరి, బీజేపీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, నరసింహ, గ్రామ సర్పంచ్ రాజు పాల్గొన్నారు.