23 July, 2026 | 3:40 AM

మహిళా సంఘ భవనానికి భూమిపూజ

23-07-2026 01:40 AM

తాడ్వాయి, జూలై, 22( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాలోజివాడి గ్రామంలో బుధవారం మహిళా సంఘ భవనానికి గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘ భవనానికి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘ భవనాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్, ఏఈ కల్పన, ఐకెపి సీసీ రాజిరెడ్డి,కార్యదర్శి సతీష్, గ్రామ సంఘం అధ్యక్షురాలు కృష్ణవేణి, మహిళా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.