వార్ అంటే వార్!
- పాట్నా రణరంగం
- రాహుల్‌పై దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణుల నిరసన
- ప్రధాని మోదీ తల్లిపై వ్యాఖ్యల విషయంలో బీజేపీ అభ్యంతరం
- ఇరుపార్టీల ర్యాలీలు ఎదరుపడి ఉద్రిక్తత
- పరస్పరం కర్రలతో దాడులు
పాట్నా, జూలై 22: బీహార్ రాజధాని పాట్నాలో బుధవారం కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు తన్నుకున్నాయి. ఒకరికొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీల జెండాలతో నాయకులు, కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. భారీగా రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆ ప్రాం తం రణరంగంగా మారింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. తీవ్ర ఘర్షణతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
రాకపోకలు నిలిచిపోయి, జనజీ వనం స్తంభించిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దాడిని బీజేపీ నేతలు ఖండిస్తూ.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సదాకత్ ఆశ్రమంలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం(పీసీసీ) వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తేజస్వీయాదవ్ ఇద్దరూ కలిసి నిర్వహించిన ‘ఓటర్ అధికార యాత్ర’ కార్యక్రమంలో కొందరు వ్యక్తులు..
ప్రధాని మోదీ సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బీజేపీ అగ్ర నాయకులంతా భగ్గుమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్య లు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం.. ఈ ఘటనపై స్పందించారు. ప్రధాని మోదీని క్షమించమని అడిగారు.
తప్పుడు వ్యాఖ్యలను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుం టామని వివరించారు. అయినప్పటికీ బీజేపీ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని.. మోదీపై, ఆయన తల్లిపై వ్యాఖ్యలకు నిరసనగా బీహార్ రాజధాని పాట్నాలో ర్యాలీ నిర్వహించారు. అయితే దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యక ర్తలు కూడా మరొక ర్యాలీ నిర్వహించారు. ఈ రెండు ర్యాలీలు ఒకదానికొకటి ఎదురు పడటంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఇరువర్గాల మధ్య మొదలైన తోపులాట కొద్దిసేపటికే తీవ్ర రూపం దాల్చింది. కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకుంటూ, భారీగా రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో సుమా రు డజను మందికి పైగా గాయపడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘర్షణల కారణంగా రద్దీగా ఉండే దానాపూర్- గాంధీ మైదాన్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పరిస్థితి అదుపుతప్పడంతో రంగం లోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణ జరిగిన సమయంలో బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ సహా పలువురు సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు : బీజేపీ
ఈ ఘటనపై రాజకీయ నాయకుల స్పందనలు కూడా అంతే ఘాటుగా ఉన్నాయి. బీజేపీ నాయకులు ఈ దాడి ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు తమను అన్యాయంగా రెచ్చగొట్టారని.. ఈ దాడి వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, ఆయ న తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చు కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు నితీశ్ కుమార్ ప్రభుత్వం కావాలనే తమ ర్యాలీ ని అడ్డుకోవడానికి బీజేపీకి సహకరించిందని ఆరోపించారు. తమపై జరి గిన దాడి వెనుక అధికార పార్టీల కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు వాదించారు.






