కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు
పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కామారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి అరెస్టును నిరసిస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, జిల్లా మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన NEET పరీక్షా వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగల్ అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, పండ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.






