టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం ఫ్యూచర్ సిటీ, కర్తల్, రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, 5 డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణల కారణంగా జిల్లా శాఖలు, కేంద్ర సంఘంలో ఏర్పడిన ఖాళీ పదవుల భర్తీ చేపట్టాలన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం కార్యాలయ భవన నిర్మాణం కోసం హైదరాబాద్, జిల్లాలలో కేటాయించిన స్థలాలు, నిర్మాణ పురోగతి తదితర అంశాలపై చర్చించారు.
పెండింగ్లో ఉన్న జిల్లాలోనూ వెంటనే యూనియన్ కార్యాలయం కు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు, సీపీఎస్ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా టిజిఓ కార్యదర్శి మోదుగు వేలాద్రి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ తొందర్లోనే అందేలా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు గంగవరపు నరేందర్, కార్యవర్గ సభ్యులు జాన్ పాటిల్ హాజరయ్యారు.






