కొండాపూర్‌లో ఘనంగా మొహర్రం వేడుకలు
27-06-2026 12:29 AM
కొండాపూర్, జూన్ 26 : మొహరం పండగను కుల మతాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కొండాపూర్ తో పాటు అనంతసాగర్, మారేపల్లి, తోగర్ పల్లి, మల్లె పల్లి, గంగారం, మాందా పూర్, మల్కాపూర్ గ్రామాల్లో పీర్ల మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం గ్రామాల్లోని పలు కాలనీల మీదుగా ప్రధాన సెంటర్ల వరకు ఊరేగింపు నిర్వహించారు.
షియా ముస్లింలు మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ కర్బలా యుద్ధంలో వీరమరణం పొందిన సందర్భంగా ఆయన త్యాగం న్యాయం కోసం చేసిన పోరాటాన్ని స్మరిస్తూ పీర్ల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఐక్యమత్యంగా అలాయ్ బాలయ్ ఆడుతూ సోదర భావానికి ప్రతీకగా పీర్లకు ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకున్నారు.






