పాటిల్‌తో ఏం మాట్లాడారు?
- ఏ ప్రాజెక్టుల గురించి చర్చించారు
- రాష్ట్ర ప్రయోజనాలపై తెచ్చిన హామీలేంటి
- కేంద్ర జలశక్తి మంత్రితో భేటీపై సీఎం రేవంత్ స్పష్టతనివ్వాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- తెలంగాణపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి
- రేపటి నుంచి నితిన్ నబిన్ పర్యటన
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఏ ప్రాజెక్టుల గురిం చి మాట్లాడారు, రాష్ట్ర ప్రయోజనాలపై తెచ్చిన హామీలేంటి? ప్రజల ముందు ఉంచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తుంగభద్రపై చాలా మాట్లాడుతున్నారు. తుంగభద్ర గేట్ల మరమ్మతుల వ్యవహారాన్ని మేము స్వాగతిస్తున్నాం.
అయితే నీటి వాటా ల విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్ (35 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు) ద్వారా తెలంగాణకు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, కేవలం 5 టీఎంసీలే చూ పిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్‌ల నీటికి సంబంధించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలోనూ ఇరు పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని పేర్కొన్నారు. మనకు రావాల్సిన వాటా కంటే తక్కువకి కేసీఆర్ సంతకం పెట్టారని ఆరోపించారు.
పాస్‌పోర్టు ప్రయాణ డాక్యుమెంట్ మాత్రమే
ఎన్‌ఆర్సీ (ఎన్‌ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టం అంశాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నాయని రాంచందర్‌రావు మండిపడ్డారు. 2013 బాంబే హైకోర్టు తీర్పు ప్రకా రం పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి రు జువు కాదని వెల్లడించారు. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రజాప్రయోజనాల దృష్ట్యా భారతీయుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీ చే స్తుందన్నారు.
ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు ఆధారాల కోసం నిర్దేశించిన 12 ర కాల పత్రాల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటన్నారు. చట్టాలు చదువుకున్న బారిస్టర్ అయిన ఓవైసీ.. ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని హితవు పలికారు. దలైలామాకి కూడా పాస్‌పోర్టు ఉందని, కానీ ఇండియన్ సిటిజన్‌షిప్ కాదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యం
తెలంగాణలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, అధికారం దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాంచం దర్‌రావు తెలిపారు. ఇందులో భాగంగా బీజే పీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈనెల 28, 29,30 తేదీల్లో మూడు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారని వెల్లడించారు.
ఒక జాతీయ అధ్యక్షుడు మూడు రోజుల పూ ర్తి సమయాన్ని రాష్ట్రానికి కేటాయించడం తెలంగాణపై వారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమన్నారు. గతంలో ప్రధాని నరేంద్రమో దీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన తరహాలోనే నితిన్ నబిన్ పర్యటన కొనసాగుతుందన్నారు. నబిన్ పర్యటన క్యాడర్‌లో ఉత్సాహం, అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందన్నారు.
పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్న నితిన్ నబీన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన మూ డు రోజుల పర్యటనలో భాగంగా 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారని రాంచందర్ రావు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కార్యాలయాలను ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సాయం త్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వేలాది మంది బూత్ అధ్యక్షులతో జరిగే భారీ సమావేశంలో పాల్గొంటారని, అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని వివరించారు.
29న ఉదయం వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాన్‌క్లేవ్‌లో పాల్గొని, అనంతరం వరంగల్ వెళ్తారని పేర్కొన్నారు. మార్గమధ్య లో భువనగిరిలో ఘనస్వాగతం అందుకుంటారని వివరించారు. వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండ్స్ వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా రని, ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పా ల్గొంటారని తెలిపారు. 30న ఘట్‌కేసర్‌లో రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని, అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారన్నారు.






