27 June, 2026 | 2:51 AM

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

27-06-2026 01:32 AM

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి 

ఇబ్రహీంపట్నం, జూన్ 26 (విజయక్రాంతి): ఆదిభట్ల సర్కిల్, శంషాబాద్ జోన్ పరిధిలోని మన్నెగూడ జెఎమ్‌ఆర్  ఫంక్షన్ హాల్లో ‘ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం‘ శు క్రవారం అత్యంత ఘనంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మ ల్రెడ్డి రంగారెడ్డి గారు స్వహస్తాలతో మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోందని సంక్షేమ పథకాలను వివరించారు. మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళా స్వావలంబన సాధించాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, ఆదిభట్ల సర్కిల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.