దక్షిణాసియా రాక్ బాల్ టోర్నమెంట్ జట్టులో గోపాల్‌కు చోటు
మేడ్చల్ అర్బన్ జూన్ 26 (విజయక్రాంతి): దక్షిణాసియా రాక్ బాల్ టోర్నమెం ట్ కు భారత జట్టులో గోపాల్ యాదవ్ కు చోటుదక్కింది. నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో జూన్ 27 నుండి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మకంగా ‘మొదటి దక్షిణాసియా రాక్ బాల్ టోర్నమెంట్‘ లొ పాల్గొనే జట్టుకు పూడూరుకి చెందిన గోపాల్ యాదవ్ ఎంపికయ్యారు. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించి న రాక్ బాల్ క్రీడా ప్రదర్శనలు, ప్రతిభ ఆధారంగా జాతీయ సెలెక్టర్ లు ఆయనను ఎంపి క చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం పట్ల పూడూరు ప్రజలు హర్షం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మా ట్లాడుతూ రాక్ బాల్ టోర్నమెంట్ క్రీడలో భారతదేశం తరుపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయ న స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన గోపాల్ యాదవ్ ను పట్టణ ప్రజలు ఆయన స్నేహితులు అభినందించారు.






