28 June, 2026 | 2:46 AM

షోయబ్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రవాదులు

28-06-2026 01:34 AM

పహెల్గామ్ మాస్టర్ మైండ్.. వీడియో విడుదలతో బహిర్గతం

ఇస్లామాబాద్, జూన్ 27: పహల్గాం దాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరీ, ఖలీద్ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇతనితోపాటు భారత్‌లో ఉగ్రదాడులకు కారణమైన లష్కర్ చెందిన పలువురు ఉగ్రవాదులు కూడా ఇస్లామాబాద్‌లో శనివారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఎల్‌ఈటీ (లష్కర్ పీఎంఎంఎల్ (పాకిస్తాన్ మార్కజీ ముస్లిం లీగ్ సయీద్ స్థాపించిన పార్టీ)లు విడుదల చేశాయి.

అంత్యక్రియల్లో పీఎంఎంఎల్‌కు చెందిన ఇనామ్ ఉర్ రెహ్మాన్ కూడా పాల్గొన్నాడు. పీఎంఎంఎల్‌పై ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిషేధం విధించింది. దీంతో భారత వ్యతిరేక శక్తులకు పాక్ స్వర్గధామంగా ఉందని, ఉగ్రవాదులపై ఎలాంటి ఆంక్షలు లేవని, పైగా వారికి పెద్ద ఎత్తున భద్రత కూడా కల్పిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. పాక్‌లోని కీలక వ్యక్తులతో ఉగ్రసంస్థలు సంబంధాలు నెరపుతున్నాయని ఈ వీడియో స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీడలను, ఉగ్రవాదాన్ని వేరుగా చూడాలని, ఉంచాలని చెబుతున్న పాక్ ప్రభుత్వం, క్రీడామంత్రిత్వ శాఖలు ఇప్పుడేం చెబుతాయో మరీ.