కొత్తగూడెంలో తీవ్ర విషాదం.. పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెల్లారితే పదో తరగతి పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థి(Tenth student) తోటి విద్యార్థుల ముందు చిన్నచూపు చూశారని మనస్థాపంతో శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెం లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీదేవిపల్లి మండలం మామిడి తోట కాలనీకి చెందిన అప్పం రితీష్ (16) స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల్లో పాస్ అవుతానో లేదో అని మనస్థాపంతో తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు తల్లి మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవి పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు సమాచారం మేరకు తోటి విద్యార్థులతో చిన్నచిన్న విభేదాలు రావడంతో పాల కేంద్రంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న రితీష్ ను భజన మందిరం దగ్గర గల మరో బ్రాంచ్ కి మార్చడం జరిగింది. దీంతో గత కొంతకాలంగా మనోవేదనతో బాధపడుతున్నడు తెలుస్తోంది. తండ్రి లేకున్నా మిషన్ కొట్టుకొని కుటుంబాన్ని పోషిస్తూ, ఒక్కగానీ ఒక కొడుకును చదివించి ప్రయోజకుడ్ని చేద్దామనే ఆ తల్లికి కడుపు కోత మిగిలింది.




