14 March, 2026 | 11:46 AM

బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడిగా లక్ష్మణ్

14-03-2026 10:27 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చెరుకుపల్లి లక్ష్మణ్ నియమితులయ్యారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో జరిగిన ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ,జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాంబాబులు లక్ష్మణ్ కు నియామక పత్రం అందజేశారు.అనంతరం నూతన అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర,జిల్లా కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బీఎస్పీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ మంచాల శ్రీకాంత్,నాయకులు లింగస్వామి,బొడ్డు కిరణ్,వేముల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.