14 March, 2026 | 2:27 PM

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

14-03-2026 10:23 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పదో తరగతి ప్రజా పరీక్షలు(Tenth class exams begin) శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు భయం, ఆందోళనలను దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలను రాయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 175 హైస్కూల్స్ నుంచి ఈ పరీక్షలకు మొత్తం 6949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

పరీక్షల నిర్వహణ కోసం 500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు 38 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయగా, అక్రమాలను అరికట్టేందుకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్న నేపథ్యంలో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.