బండి 'అంజన్నయాత్ర'కు నీరాజనం
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ శనివారం ఉదయం ప్రారంభమయింది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కాషాయ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి బీజేపీ నుండి ఎన్నికైన వార్డు సభ్యులు, ఉపసర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాదయాత్ర లో పాల్గొన్నారు.
దారి పొడవునా డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో మారుమోగింది. టెన్త్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జాం కాకుండా హైవేపై క్రమశిక్షణతో పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తు బండి కాషాయ దళం ముందుకు సాగింది. రేకుర్తి మీదుగా కొత్తపల్లి , వేదిరా, పూడూరు మీదుగా సాయంత్రం వరకు ‘అంజన్న ఆశీర్వాద యాత్ర'(Anjanna Ashirvada Yatra) కొండగట్టు వరకు చేరుకోనుంది.




