9 May, 2026 | 9:50 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా

14-02-2026 12:38 AM

పినపాక, ఫిబ్రవరి 13,(విజయక్రాంతి) తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (టి ఈ ఎల్ ఎస్ ఏ) వారి ఆర్థిక సహకారంతో జడ్పీహెచ్‌ఎస్ పినపాక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా దుస్తులను శుక్రవారం పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూతనందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యులైన మల్లికార్జున కేశవరాజు ప్రోత్సాహంతో తన బాల్య మిత్రులు అయినటువంటి కె వి రమణమూర్తి ద్వారా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు.దాతలు అందించిన ఈ సహకారాన్ని స్వీకరించి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య, పినపాక సర్పంచ్ అలివేలు, ఏఐపిసి చైర్ పర్సన్ కౌసల్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.