14-02-2026 12:37:20 AM
మణుగూరు, ఫిబ్రవరి 13(విజయక్రాంతి) :మొబైల్ కోర్టుల రద్దును నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మణు గూరు కోర్టులో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలి పారు. అనంతరం న్యాయవాదులు ప్రభుత్వం మొ బైల్ కోర్ట్ రద్దు నిర్ణయాన్ని విరమింప చేసుకోవాలని కోరుతూ జడ్జి శివ నాయక్ కు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోడిశాల వెంకటరత్నం, దాసరి కవిత, చిర్రా సరస్వతి, గొడుగునూరి నాగార్జున రెడ్డి,కందిమల్ల నరసింహారావు, అశోక్, గద్దల సాంబశివరావు పాల్గొన్నారు.