9 May, 2026 | 10:47 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

పూలే విగ్రహ శంకుస్థాపన

14-02-2026 12:39 AM

మోతె, ఫిబ్రవరి 13 : మహాత్మా జ్యోతి బా పూలే విగ్రహ శంకుస్థాపన శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. పల్లెల పరివర్తన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి లు పూలే విగ్రహ శంకుస్థాపన చేసిన అనంతరం వారు మాట్లాడారు.

మహాత్మా జ్యోతి రావు పూలే చరిత్ర కారుడని పూలే చరిత్ర ను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని పూలే జీవితం బావి తరాలకు స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ పల్లెల, వార్డు సభ్యులు వీరబాబు, తరుణ్, నవీన్, యశోద, మాదవి, భద్రమ్మ, రమేష్, కమిటీ సభ్యులు యల్ యన్ రాజు,  రాము, తదితరులు పాల్గొన్నారు.